సల్మాన్‌కు అరుదైన గౌరవం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటిష్ పార్లమెంట్లో ఆయనకు గ్లోబల్ డైవర్సిటీ అవార్డు-2017ను ప్రదానం చేశారు. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, బుల్లితెర వ్యాఖ్యాతగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగానూ ఈ అవార్డును ప్రదానం చేశారు. గతంలో ఇదే అవార్డును బాలీవుడ్ నటుటు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, షారుక్‌ఖాన్, చైనీస్ యాక్షన్ ఐకాన్ జాకీచాన్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, అమెరికన్ సివిల్ రైట్స్ లీడర్ జెస్సీ జాక్సస్, బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అందుకున్నారు.













