బాలీవుడ్ కు సచిన్ కుమార్తె!
మాస్టర్ బ్లాస్టర్గా గతంలో క్రికెట్లో సంచలనాలను సృష్టించిన సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ నటిగా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిచయం కాబోతోందట. ప్రముఖ నటుడు అమీర్‌ఖాన్ ద్వారా ఆమె అరంగ్రేటు జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కోరికి ఒక్కోరంగంపై మక్కువ ఏర్పడుతుంటుంది. సారాకు కూడా చిన్నతనం నుంచి సినిమారంగంలోకి రావాలన్న కోరిక ఉండేదట. అది ఆమెతో పాటే పెరిగి పెద్దదైంది. దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడు కావడంతో ఆమె ఎంట్రీకి మార్గం సుగమమైందని అంటున్నార. దాదాపు 20 ఏళ్ల వయసు కలిగిన సారా తన తల్లి అంజలి, తండ్రి సచిన్‌తో కలిసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అలాగే సమాజ సేవ చేయడమన్నా సారాకు ఎంతో ఇష్టం. నటిగా పరిచయమైన తర్వాత భవిష్యత్‌లో ఎలాంటి గుర్తింపును ఆమె సొంతం చేసుకుంటుందో కాలమే సమాధానమిస్తుంది.













