రోహిత్ నారా సైకలాజికల్ హారర్ మూవీ టైటిల్ ‘కపాలి’- టెర్రిఫిక్ ఫస్ట్ లుక్
హీరో రోహిత్ నారా ప్రస్తుతం పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు. ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు. రోహిత్ నారా పుట్టినరోజు సందర్భంగా, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్‌తో పాటు సినిమా టైటిల్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘కపాలి’ అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో రోహిత్ నారా ఇంటెన్స్ ఎమోషన్స్ తో కనిపిస్తున్నారు. కనిపించని ఓ శక్తితో పోరాడుతున్నట్లు పోస్టర్లో చూపించారు. గడ్డం, భయానకమైన చూపులు ఆయన పాత్రలోని ఇంటెన్సిటీని చూపిస్తున్నాయి. ఆయన తలపై కిరీటంలా కనిపించే వంకర చెట్టు కొమ్మలు మిస్టికల్ కనెక్షన్‌ను సూచిస్తున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ప్రాచీన చిహ్నాలతో కూడిన డిజైన్ సినిమా మిస్టరీ, క్షుద్రశక్తులు, పురాణ నేపథ్యాన్ని సూచిస్తోంది. “A Journey Into The Unknown” అనే ట్యాగ్‌లైన్ పోస్టర్‌లోని మిస్టరీని మరింత ఎలివేట్ చేస్తోంది.
పోస్టర్ ముందు భాగంలో ఎర్రటి కళ్లతో కనిపించే భయానక మహిళా రూపం అతీంద్రియ శక్తిని సూచిస్తోంది. ఆమె పక్కనే తుపాకీ పట్టుకున్న పోలీసులతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు కనిపిస్తున్నారు. ఒక పోలీస్ వాహనం ప్రకాశవంతమైన యాగ వలయంపై నిలిచినట్లు చూపించడం ద్వారా, పోలీస్ వ్యవస్థ ఓ భయానక పారానార్మల్ మిస్టరీలో చిక్కుకుపోతుందని పోస్టర్ హింట్ ఇస్తోంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేలా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలోని మిగతా నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.








