నటి రహస్య వివాహం
అలనాటి నటి మున్మున్ సేన్ కుమార్తె, బాలీవుడ్ నటి రియా సేన్ రహస్యంగా వివాహం చేసుకుంది. కొంతకాలంగా రియా పొటోగ్రాఫర్ శివమ్ తివారీలు ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఎవ్వరికీ తెలీయకుండా పుణేలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో వివాహం చేసేకున్నారు. మరోపక్క రియా గర్భవతి కావడంతో హడావుడిగా పెళ్లి చేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. రియా తమిళంలో ప్రముఖ దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన తాజ్‌మహల్ చిత్రంలో నటించింది. అమె సోదరి రైమా సేన్ తెలుగులో నితిన్‌కి జోడీగా ధైర్యం చిత్రంలో నటించింది.








