నా కొడుకు ఎప్పటికీ జూనియర్ పవర్‌స్టార్ కాకూడదు
తన కుమారుడు జూనియర్ పవర్‌స్టార్‌గా కాకుండా అకీరా నందగానే తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకుంటాడన్న నమ్మకం ఉందని రేణు దేశాయ్ అన్నారు. నేడు అకీరా తన 13వ పుట్టినరోజును జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా రేణు ట్విటర్ వేదికగా కుమారుడికి శుభాకాంక్షలు చెప్పారు. 13 నా చిట్టికుమారుడు అరడుగుల ఎత్తుతో టీనేజ్‌లోకి అడుగుపెట్టడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, నా బాబుకు 13 ఏళ్లు అని ఆలోచిస్తుంటే పుట్టే భావోద్వేగంలో నిజంగా నాకు మాటలు కరవయ్యాయి. ఈ ప్రపంచంలో అతను తనంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని, తల్లిదండ్రుల నీడలో కాకుండా తన కాళ్లపై తాను నిలబడాలని ప్రార్థిస్తున్నా. నా కుమారుడికి సొంత గుర్తింపు ఉంటుందని, జూనియర్ పవర్‌స్టార్‌గా కాకుండా ఆకీరానందగా పేరు తెచ్చుకుంటాడన్న నమ్మకం ఉంది. నా స్వీట్హార్ట్ అకీరాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రేణు పోస్ట్ చేశారు. దీంతోపాటు అకీరతో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.













