ధర్మన్ కోసం వాయిదా పడిన RAPO23!
వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni), ఈసారి తన కెరీర్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. నెక్ట్స్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ఆయన, ప్రస్తుతం RAPO23 పేరుతో తెరకెక్కుతున్న సినిమాపై దృష్టి సారించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూళ్లను పూర్తి చేసిన యూనిట్, తొలుత 2026 డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించింది. అయితే సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ధర్మన్(Dharman) సినిమాలో నటించే అవకాశం రావడంతో రామ్ తన ప్లాన్స్ ను మార్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన భారీ స్థాయిలో డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది.
ధర్మన్ షూటింగ్లో భాగం కావడంతో రాపో23 సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రజినీకాంత్ సినిమాలోని క్యారెక్టర్ కోసం రామ్ సరికొత్త లుక్‌లోకి మారారు. ధర్మన్ షూటింగ్ పూర్తైన తర్వాతే తన నెక్ట్స్ సినిమాకు సంబంధించిన లుక్‌లోకి తిరిగి మారి, మిగిలిన షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. ధర్మన్‌లో రామ్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అశ్వత్ మారిముత్తు(Aswath marimuthu) దర్శకత్వంలో కమల్ హాసన్(Kamal haasan) నిర్మిస్తున్న ధర్మన్‌లో సిమ్రాన్(Smiran), నయనతార(Nayanthara), రాశీ ఖన్నా(Raashi khanna), శ్రీలీల(Sree leela), యోగిబాబు(Yogi babu) కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్(Anirudh) మ్యూజిక్ అందిస్తున్నారు. మొదట సంక్రాంతి 2027కు రిలీజ్ చేయాలని భావించిన ఈ సినిమాను ప్రస్తుతం వేసవికి వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో రామ్ నటిస్తున్న రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై ఆసక్తి నెలకొంది.







