భల్లాలదేవుడి భార్య ఎవరో చెప్పాడు
బాహుబలి 2 సినిమా రిలీజ్ కి ముందు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న సినీ లవర్స్ కి కంటిపై కనుకు లేకండా చేసింది. ఇక రిలీజ్ తర్వాత భళ్ళాలదేవుడు భార్య ఎవరంటూ ఫ్యాన్స్ బాహుబలి టీంని ప్రశ్నించడం మొదలు పెట్టారు. కొన్ని సందర్భాలలో రాజమౌళి ఈ ప్రశ్న నుండి ఎస్కేప్ కాగా, రానా మాత్రం ఫన్నీ ఆన్సర్స్తో ఫ్యాన్స్‌లో ఇంకాస్త ఆసక్తి పెంచాడు. అయితే రీసెంట్గా ఓ అభిమాని బాహుబలి 2లో మీ భార్య ఎవరు? మిలియన్ డాలర్ల ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాల్సిందే అని రానాకు ట్వీట్ చేయగా, దీనికి రానా, కాజల్ అంటూ సమాధానమిచ్చాడు. ఈ ట్వీట్‌ని కాజల్ అగర్వాల్ రీట్వీట్ చేస్తూ, ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ హాట్ టాపీక్ గా మారింది. రానా, కాజల్ ప్రస్తుతం నేను రాజు నేనే మంత్రి అనే చిత్రంలో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్ర టీజర్ విడుదల కాగా, త్వరలోనే మూవీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.













