ఆ సీన్ చేసేటప్పుడు చాలా భయంవేసింది
మూడు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తూ వస్తుంది రమ్యకృష్ణ. ఇప్పుడు తన పేరునే మార్చేసింది బాహుబలిలోని శివగామి పాత్ర. కాగా ఈ సినిమాలో ఓ సీన్ చేసేపటప్పుడు రమ్యకృష్ణకు చాలా భయం వేసిందట. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శివగామి క్యారెక్టర్ కు తాను ఎలాంటి హోమ్వర్కూ చేయలేదని, రాజమౌళి ఎలా చెప్పితే అలా నటించానని చెప్పింది. ఈ సినిమాలో నీటిలో మునిగి బిడ్డను పట్టుకునే సీన్ చేసేటప్పుడు చాలా భయపడిందని చెప్పింది. ఆ సీన్ చేయడం ఒక సవాలుగా మారిందని చెప్పింది. ఆ షూటింగ్ ను కేరళ లోని నీటి ప్రవాహం అధికంగా ఉండే చల్లకుడి జలపాతంలో చేశారు. వేగంగా ప్రవహిస్తున్న నదిలోకి దిగి తాను చేతులు బయటకి పెట్టాలి. మొత్తాని ఆ సీన్ భయపడుతూనే చేశానని చెప్పింది రమకృష్ణ.













