బన్నీ, అఖిల్, అకీరాలకు శుభాకాంక్షలు తెలిపిన రామ్‌చరణ్
రామ్‌చరణ్‌తేజ్ తాజాగా ఫేస్బుక్ ద్వారానే ముగ్గురు వ్యక్తులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. అలాగే అఖిల్ జన్మదినం కూడా ఈ రోజే. అలాగే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ బర్త్‌డే కూడా ఇదే రోజు. కాబట్టి, బన్నీ, అఖిల్, అకీరాలకు ఒకేసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేశాడు రామ్‌చరణ్. ‘ఒకేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియమైన సోదరులు ముగ్గురికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ రోజు ఎంతో అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాన’ని కామెంట్ పెట్టాడు. అలాగే వివిధ సందర్భాల్లో ముగ్గురితో కలిసి దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేశాడు.













