ఆ వార్తల్లో నిజం లేదు
దర్శకుడు రాంగోపాల్ వర్మ అలనాటి నటుడు ఎన్టీఆర్ జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. అయితే ఈ సినిమాకు ప్రముఖ నటుడు జె.డి.చక్రవర్తి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా దీనిపై వర్మ ఫేస్బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. జె.డి చక్రవర్తి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి నిర్మాతగా వ్వవహరిస్తున్నారని వస్తున్న వార్తల్లో ఏమాంత్రం నిజం లేదని సృష్టం చేశారు.








