కేసీఆర్ అద్భుతమైన నాయకుడు : వర్మ
తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంపై వర్మ ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉన్నారు. ఛార్మి సిట్ విచారణ అనంతరం ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయ్తో పోలుస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వర్మ, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశంసించారు. డ్రగ్స్ వాడుతున్న వారు కేవలం బాధితులన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న కేసీఆర్ అద్భుతమైన, అందమైన నాయకుడని వర్మ అన్నారు. ఆయనలా ఆలోచించే విచారణ బృందం అవసరమని పేర్కొన్నారు.








