పవన్ సరసన రకుల్?
వచ్చిన అవకాశాల్ని అందుకుంటూ దాదాపు అందరూ హీరోలతో నటిస్తూ అగ్రస్థానంలో ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్‌తో జయజానకి నాయక, మహేశ్‌బాబుతో స్పైడర్ చిత్రాల్లో నటిస్తోంది. అంతేకాదు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో పవన్ కల్యాణ్‌కి జోడీగా రకుల్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. సినిమా స్క్రిప్ట్‌ని సంతోష్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరో పక్క పవన్‌కల్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఈ సినిమా అయ్యాక పవన్ సంతోష్‌తో కలిసి పనిచేయనున్నట్లు టాలీవుడ్ టాక్.













