అతనితో డేటింగ్ చేస్తా
ఆ హీరో అంటే చాలా ఇష్టం. ఒకవేళ డేటింగ్ చేయాల్సి వస్తే అతనితో చేస్తానంటోంది గ్లామర్ భామ రకుల్ ప్రీత్‌సింగ్. ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా వరస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు టాప్ హీరోయిన్ రేసులో ఉంది. ప్రస్తుతం మహేశ్ సరసన స్పైడర్ చిత్రంలో నటిస్తున్న రకుల్, వెంటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో పరిచయమై వరుస అవకాశాలతో స్టార్ రేంజ్‌కి చేరింది. ముఖ్యంగా స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తున్న రకుల్ డేటింగ్ చేయడానికి ఇష్టపడే హీరో ఎవరో తెలుసా. బాలీవుడ్లో యువ హీరో రణవీర్‌సింగ్. రణవీర్ అంటే తనకు ఇష్టమని, అతనితో అవకాశం వస్తే డేటింగ్ చేస్తానని చెబుతోంది. ఇప్పటికే హిందీలోనూ యారియన్ చిత్రంలో నటించింది. తాజాగా సిమ్లా మిర్చి చిత్రంలో నటిస్తున్న రకుల్, తమిళంలో కూడా క్రేజీ అవకాశాలతో బిజీగా ఉంది.













