రజనీకాంత్ ఎంట్రీకి ఇంకా టైముందట!
రాజకీయ రంగప్రవేశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రకటించారు. ఆయన ముంబై బయలుదేరి వెళుతూ చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే సెప్టెంబరు నెలాఖరులో గానీ, అక్టోబరు ప్రథమార్థంలోగానీ అభిమానులతో ఫోటో సెషన్ ఉంటుందని తెలిపారు. నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు అందరికీ సమాధనం చెబుతాను. దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని రజనీ సృష్టం చేశారు. ప్రస్తుతం కాలా సినిమాలో నటిస్తున్న తలైవా వైద్య పరీక్షల నిమిత్తం జూలై మొదటివారంలో అమెరికా వెళ్లనున్నారు. జులై 12న రజనీ స్వదేశానికి తిరిగి వస్తారని సమాచారం. రెండేళ్ల క్రితం రజనీ తీవ్ర అస్వస్థతకు గురై అమెరికా ఆసుపత్రిలో చికిత్స పొందారు. కాలా కోసం ముందు జాగ్రత్త చర్యగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నారు.













