రజనీ రాజకీయాల్లోకి రావడం ఖాయం
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమనే సంకేతాలు రోజరోజుకు బలపడుతున్నాయి. తనను కలిసిన హిందూ మక్కల్ కట్చి నేతల వద్ద తను రాజకీయాల్లోకి రానున్నట్లు రజనీ పరోక్షంగా సంకేతాలిచ్చారు. అర్జున్సంపత్ నేతృత్వంలోని పలువురు నేతలు రజనీ నివాసానికి వెళ్లి ఆయన్ని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం వెలుపలికి వచ్చిన అర్జున్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి ఏదైనా చేయాలని ఉందని రజనీ అన్నారు. రాజకీయాల్లో చేరే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు అన్నారు.








