15 నుంచి అభిమానులను కలవనున్న సూపర్‌స్టార్
తన అభిమానులతో సమావేశం కావాలని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు నిర్ణయించినట్లు ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ఇందులో అభిమానులను బృందాలవారీగా రజనీకాంత్ కలుస్తారని ఆయన చెప్పారు. అభిమాన సంఘాలతో రజనీ భేటీపై కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సూపర్‌స్టార్ సన్నిహితుడి నుంచి సమావేశం తేదీలు వెలువడటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.








