బాహుబలి ఆడియో లాంచ్‌కి సూపర్‌స్టార్?
బాహుబలి ఆడియో విడుదల కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఏప్రిల్ 9న చెన్నైలో జరగబోయే తమిళ ఆడియో విడుదల కార్యక్రమానికి తలైవా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రజనీతో పాటు చాలా మంది దక్షిణాది స్టార్ సెలబ్రెటీలు కూడా ఈ వేడుకకు హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రలో నటించగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించారు. బాహుబలి ది బిగినింగ్‌కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.







