మళ్లీ అభిమానులను కలుస్తా : రజనీ
అభిమానులతో త్వరలో మరోసారి సమావేశమవుతున్నట్లు తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ సృష్టం చేశారు. ముంబయిలో కాలా చిత్రం తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగి వచ్చిన ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. కాలా చిత్రం రెండో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. దశాబ్ద కాలం అనంతరం మే నెలలో అయిదు రోజుల పాటు రాష్ట్రంలోని 15 జిల్లాల అభిమానులతో రజినీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభిమానుల చిరకాల కోరికైన రాజకీయాల్లోకి రావడంపై ఆయన సంకేతాలు ఇచ్చారు.








