రజనీకాంత్ కాలా చూడముచ్చట…
సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజాగా నటిస్తున్న సినిమా కాలా. ఈ మూవీకి కబాలీ పేమ్ రంజీత్ దర్శత్వం వహిస్తున్నారు. ముంబైకి చెందిన ఒక గ్యాంగ్‌స్టర్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముంబై, చెన్నైలో కొనసాగుతోందిది. కాలా లో రజనీ భార్య పాత్రలో ఈశ్వరీరావు, విలన్‌గా నానా పటేకర్తోపాటు మరో బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషి కూడా ఇందులో నటిస్తున్నారు. రజనీ అల్లుడు, తమిళ హీరో ధనుష్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ కాలా కుటుంబం అంటూ ఒక స్టిల్ ను రిలీజ్ చేసింది. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు ఒక కుక్క ఉన్న ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.








