అమెరికా పర్యటనలో సూపర్‌స్టార్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం కాలా కరికాలన్ సినిమా షూటింగ్లో ఉన్న రజనీకాంత్ అమెరికా ప్రయాణం గురించి ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. సాధారణ వైద్య పరీక్షలకు, క్రమం తప్పకుండా జరిగే చెకప్ కోసం ఆయన అమెరికా పర్యటన తలపెట్టుకున్నట్లు వెల్లడైంది. రజనీ రాజకీయాలలోకి వస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలోనే ఆయన అమెరికా యాత్ర పెట్టుకోవడం చర్చకు దారితీసింది. ప్రస్తుతం రజనీకాంత్ తాజా సినిమా ముంబై మురికివాడలలో జోరుగా సాగుతోంది. ఇటీవలే రజనీ తన అభిమానులను కలుసుకున్నారు. తాను రాజకీయాలలోకి రావచ్చునని సంకేతాలు ఇచ్చారు. దేవుడు రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పడం ద్వారా అభిమానులలో మరింతగా ఆయన ఆత్రుత రేకెత్తించారు.













