అభిమానులను నిరాశపరిచిన సూపర్‌స్టార్
అభిమానులతో జరగాల్సిన సమావేశాన్ని తమిళనటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ రద్దు చేసుకున్నారు. ఏప్రిల్ 12-16న సూపర్‌స్టార్ అభిమానులతో ప్రత్యేకంగా సమావేశం కావాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదంటూ ఆయన సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమానికి ఎక్కువమంది అభిమానులు హాజరవుతారు. ప్రతీ ఒక్కరూ తమ అభిమాన నటుడుతో ఫొటోలు దిగాలని ఆరాటపడతారు. అది చాలా కష్టం అందుకే సమావేశాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి జిల్లాలో అభిమానులతో సమావేశమవుతానని ఆయన తెలిపారు. అప్పుడు అభిమానులు ఒక్కొక్కరూ ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఈ విషయాన్ని అభిమానులందరూ తప్పకుండా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ రజనీకాంత్ ప్రకటనలో పేర్కొన్నారు. రజనీ ప్రకటనతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.













