ముందుగా కోలీవుడ్ కే వస్తా!
ప్రముఖ నటుడు రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కోలీవుడ్లో తెరంగ్రేటం చేయబోతున్నారు. రాజశేఖర్, జీవిత దంపతులు తెలుగుతో పాటు పలు తమిళ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి వారసురాలిగా శివాని తమిళ చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న శివాని సినిమా వివరాలు త్వరలో ప్రకటిస్తానని మీడియా ద్వారా తెలిపారు. సినిమాల కోసమే తాను భరతనాట్యం, కూచిపూడితో పాటు గిటార్, వీణ వాయించడం నేర్చుకున్నానని పేర్కొన్నారు.








