ఏదో ఒకరోజు సూపర్‌స్టార్‌తో సినిమా చేస్తా
బాహుబలి సినిమాతో దర్శకుడు రాజమౌళి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించాడు. బాహుబలి ద కంక్లూజన్ తమిళ ఆడియో విడుదల సందర్భంగా చెన్నైలోని ప్రముఖ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో బాహుబలి చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కూడా ఏదో ఒకరోజు సినిమా తీస్తా. ప్రస్తుతం నా మదిలో బాహుబలి తప్ప వేరే ఆలోచన లేదు అని పేర్కొన్నారు. రజనీకాంత్‌తో సినిమా చేస్తానని స్వయంగా రాజమౌళే ప్రకటించడంతో తమిళనాడుతో పాటు, దేశ వ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













