ఈ విషయం చెప్పినా ఎవరూ నమ్మరు
ఎదుటివారిని చూడగానే ఎవరికైనా కొన్ని అభిప్రాయాలు కలుగుతుంటాయి. అన్ని సందర్భాల్లోనూ అవి వాస్తవం కావాలనే నియమమేమీ లేదు. కొన్నిసార్లు కాకనూ పోవచ్చు అని అంటోంది రాయ్ లక్ష్మి. ఈ బెంగళూరు అమ్మాయి తన మనసులోని మాటలను చెబుతూ నన్ను చూసిన వాళ్లు చాలా మంది నాకు 30 ఏళ్లు దాటేశాయని అనుకుంటారు. కానీ నాకు 26 ఏళ్లు పూర్తయ్యాయంతే. ఈ విషయం చెప్పినా ఎవరూ నమ్మరు. కావాలని వయసు దాచుకుంటున్నానని అనుకుంటారు. నా 15 ఏళ్లప్పుడు తొలి సినిమా కర్క కసడర చేశా. నా మాతృభాష తుళు కాదు. నాకు తుళులో ఒక్క ముక్క కూడా మాట్లాడటం రాదు అని వివరించారు.













