మాకే సినిమా చూపిస్తున్నారు : ఆర్.నారాయణ మూర్తి
డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి స్పందించారు. డ్రగ్స్ విషయంలో సినిమా రంగాన్నే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సిట్ అధికారులు, మీడియా తమకే సినిమా చూపిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశౄరు. 1960 నుంచి దేశంలో డ్రగ్స్ వాడకం ఉందని ఆయన చెప్పారు. ఉద్యోగులు, రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు డ్రగ్స్ వాడుతున్నారని తెలిపారు. స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్‌కి బానిసలుగా మారడం బాధకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.








