SKN: పెద్ది రిలీజ్ డేట్ పై ఎస్కేఎన్ క్లారిటీ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) నటిస్తున్న పెద్ది(peddi) సినిమా రిలీజ్ డేట్ పై ఇటీవల ఏర్పడిన గందరగోళం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. నిర్మాత SKN ఓ సినీ ఈవెంట్లో మాట్లాడుతూ పెద్ది జూన్ 26న విడుదల అవుతుందని పేర్కొనడం, మెగా అభిమానుల్లో అనేక అనుమానాలకు కారణమైంది. ముఖ్యంగా, అధికారిక ప్రకటన లేకుండానే తేదీ బయటకు రావడం వల్ల సినిమా వాయిదా పడుతోందనే భావన బలపడింది. దీంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.
ఈ వివాదంపై ఎస్కెఎన్ తాజాగా స్పందిస్తూ, జరిగినది పూర్తిగా మిస్ కమ్యూనికేషన్ వల్లేనని స్పష్టం చేశారు. ఆ వేడుకలో ఉన్న సౌండ్ డిస్ట్రబెన్స్ కారణంగా తన పక్కన ఉన్న కో ప్రొడ్యూసర్ సాయి రాజేష్(Sai rajesh) చెప్పిన విషయాన్ని తాను సరిగా వినలేకపోయానని చెప్పారు. రిలీజ్ డేట్పై బయట వార్తలు వస్తున్నాయి, అధికారిక ప్రకటన వచ్చే వరకు మనం వ్యాఖ్యానించకూడదనే సూచనను తాను తప్పుగా అర్థం చేసుకుని, ఇప్పటికే తేదీ ఖరారైనట్లుగా ప్రకటించానని వివరించారు. ఈ వివరణతో ప్రచారంలో ఉన్న అనుమానాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించారు.
ఇవి కూడా చదవండి
తన వల్ల జరిగిన గందరగోళానికి ఎస్కెఎన్ బేషరతుగా క్షమాపణలు తెలిపారు. భారీ బడ్జెట్ సినిమాల రిలీజ్ డేట్స్ ను సంబంధిత నిర్మాణ సంస్థలే అధికారికంగా ప్రకటించాలనే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. అభిమానులు, ప్రేక్షకులు తాను చెప్పిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. చివరగా, పెద్ది సినిమా ఎప్పుడు రిలీజైనా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ వివాదానికి ముగింపు పలికారు.
ఇవి కూడా చదవండి








