Ram Charan: రామ్ చరణ్ గాయంపై స్పందించిన పవన్ కళ్యాణ్
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది(peddi) షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. బుచ్చిబాబు సాన(buchibabu sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్(jhanvi kapoor) హీరోయిన్ నటిస్తుంది. షూటింగ్లో భాగంగా ఓ కీలక యాక్షన్ సీన్ ను షూట్ చేస్తుండగా రామ్ చరణ్‌కు స్వల్ప గాయం అయినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కంటి సమీపంలో చిన్న గాయం అయినట్టు తెలిసినా, అది పెద్దగా ఆందోళన చెందాల్సిన స్థాయిలో లేదని చిత్ర బృందం స్పష్టం చేసింది.
గాయం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ వైద్యులను సంప్రదించగా, వారు రెండు రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు. దీంతో షూటింగ్‌కు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. అభిమానులు ఆందోళన చెందకుండా ఉండాలని నిర్మాతలు, చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, త్వరలోనే తిరిగి షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే, ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన నోట్ లో ఆయన చరణ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని ఆశించారు. పెద్ది సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తుండగా, ఏప్రిల్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.








