కల్పనా చావ్లాగా ప్రియాంక
ఈ మధ్య బయోపిక్స్ ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. వాటిని ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. ఆ తరహాలో మరో చిత్రం రాబోతుంది. అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన తొలి మహిళ కల్పనా చావ్లా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కల్పనా చావ్లా పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. ప్రియా మిశ్రా అనే వ్యక్తి ఈ చిత్రంతోనే దర్శకులుగా పరిచయం కానున్నారు. ఈ ప్రాజెక్టుపై ఏడేళ్లుగా పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రియాంక ప్రస్తుతం తన అమెరికన్ టీవీ సిరీస్ క్యాంటికో షూటింగ్లో ఉన్నారు. దీంతోపాటు ఆమె హాలీవుడ్ సినిమా బేవాచ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రాంతీయ చిత్రాల నిర్మాణ బాధ్యతలు కూడా చూస్తోంది.













