అరుదైన రికార్డు సృష్టించిన ప్రియాంక చోప్రా
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఖాతాలో మరో మైలురాయి వచ్చి చేరింది. 2017 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని అత్యంత అందమైన 30 మంది మహిళల్లో ఆమె 2వ స్థానం సంపాదించింది. హాలీవుడ్ నటి, పాప్ గాయని బేవన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు ఆన్లైన్ మీడియా కంపెనీ బజ్నెట్ ప్రకటించిన జాబితాను ప్రియాకం స్వయంగా ట్వీట్ చేసింది. బజ్నెట్కు, నాకు మద్దతుగా ఓటేసిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. మొదటి స్థానంలో ఉండేందుకు బేవన్స్ అర్హురాలు. అమె నాకు కూడా నెం.1 అని ప్రియాంక ట్విటర్లో పోస్టు చేసింది. కాగా ఏంజిలీనా జోలీ, ఎమ్మా స్టోన్, ఎమ్మా వాట్సన్, మార్గోట్ రోబీ, బ్లేక్ లైల్లీ, ఎలిసియా వికందర్ తదితర హాలీవుడ్ అందాల భామలను దాటుకుని ప్రియాంక రెండో స్థానంలో నిలబడడం విశేషం.













