ప్రియాంకకు మరో అరుదైన గౌరవం
ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మొన్నే పుట్టిన రోజు వేడుకలను కటుంబ సభ్యులతో జరుపుకుంది. దానికి ముందు అమెరికాలో క్యాంటికో క్రైమ్ డ్రామా షూటింగ్లో పాల్గొని వచ్చింది. మరో పక్క బేవాచ్ తో హాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక ఇప్పుడు తన రెండో సినిమా షూటింగ్లో బిజీగా మారిపోయింది. ఈ అమ్మడుకు ఇటీవల జరిగిన ఆస్కార్ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించింది. తర్వాత రెండు ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా చేసింది. ఇప్పుడు మరో గౌరవం దక్కింది. సెప్టెంబర్ ఆరో తేదీన టొరొంటోలో జరగనున్న టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈమె ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో ఆమె కెరీర్ ఎలా సాగింది. యునెసెప్ గ్లోబల్ గుడ్ అంబాసిడర్‌గా అందిస్తున్న సేవలను వివరించనుంది. ఈ విషయాలన్నీ ఈ వేడుకకు కళా దర్శకుడిగా వ్యవహరించనున్న కామెరిన్ బా-లియోతో చర్చించనుంది.













