ప్రియాంకా చోప్రా గౌన్ చూశారా!
పాపం ప్రియాంక చోప్రా ఉదయాన్నే నెటిజన్లకు చిక్కింది. ఇందుకు కారణం ఆమె వేసుకున్న డ్రెస్సే. గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక తన ఫ్యాషన్ అభిరుచులతో బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌నూ మెప్పించింది. కానీ న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్లో ప్రియాంక వేసుకున్న డ్రెస్ నెటిజన్లకు నచ్చినట్లు లేదు. ఈవెంట్లో ప్రియాంక రాల్ఫ్ లౌరేన్ బ్రాండ్‌కి చెందిన బ్రౌన్ రంగు ట్రెంచ్ కోట్ వేసుకుంది. డ్రెస్ ముందంతా బాగానే ఉంది. కానీ వెనుక మాత్ర పెద్ద దుప్పటి పరచినట్లు ఉంది. దాంతో ప్రియాంక వేసుకున్న డ్రెస్ ట్విటర్లో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ప్రియాంక వేసుకున్న డ్రెస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ, ఇది స్వచ్ఛ భారత్ కోసం వేసుకున్న డ్రెస్ అని, ఐపీఎల్ సమయంలో వర్షం పడితే మైదానం తడవకుండా ప్రియాంక డ్రెస్‌తో కప్పేయండి అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.













