త్వరలో ప్రియాంక పెళ్లి!
బాలీవుడ్ గ్లామర్ భామ ప్రియాంక చోప్రా హవా మామూలుగా లేదు. ఇప్పటికే హాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం హాలీవుడ్లో రెండు ప్రాజెక్టులను చేస్తున్న ఈమె హిందీలో మరో మూడు సినిమాలను ఒప్పుకుందట. గ్లామర్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ప్రియాంక త్వరలోనే పెళ్లి చేసుకుంటుందని బి టౌన్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పెళ్లి విషయంపై ఆమె సన్నిహితులతో చర్చించినట్టు కూడా తెలిసింది. కెరీర్ జోరుమీదుండగా ప్రియాంక పెళ్లి గురించి ఆలోచించడం ఏమిటా అనే సందేశలు కూడా వ్యక్తమవుతున్నాయి. కెరీర్‌కు, పెళ్లికి సంబంధం ఏముంది దేని దారి దాందే అని చెబుతోంది. అన్నట్టు గతంలో ఈమె మగాడితో అవసరం కేవలం దానికే అని చెప్పిన బోల్డ్ కామెంట్స్ మర్చి పోయిందేమో. మొత్తానికి వచ్చే ఏడాది ప్రియాంక పెళ్లిపీటలెక్కడం ఖాయమని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.













