ప్రియాంక చోప్రాను కలిసిన నయనతార
లేడీ సూపర్‌స్టార్ నయనతార బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను కలిశారు. ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లిన నయనతార అక్కడే ఉన్న ప్రియాంకను కలిశారు. సినిమాలు, అమెరికాలో జీవిన విధానంపై వీరు మాట్లాడుకున్నారట. ఆ సందర్బంగా వీరు దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. గ్లోబల్ గోల్స్ అవార్డ్ కోసం ప్రియాంక న్యూయార్క్ వెళ్లారు. నయనతార తన ప్రియుడు విగ్నేశ్ శివాన్తో కలిసి ఇటీవల న్యూయార్క్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. విగ్నేశ్ పుట్టినరోజు వేడుకలు అక్కడే జరుపుకొన్నారు.








