న్యూయార్క్‌ను విడిచి రావడంలో బాధ… సంతోషం
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా న్యూయార్క్‌ను విడిచి రావడానికి పెద్దగా ఇష్టంగా ఉన్నట్టు లేదు. గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటోంది ప్రియాంక. క్యాంటికో టీవీ సిరీస్‌తో హాలీవుడ్లో అడుగు పెట్టింది ప్రియాంక. క్యాంటికో రెండో సీజన్ చిత్రీకరణ కూడా గత నెలలో పూర్తయింది. మరో వారంలో ప్రియాంక న్యూయార్క్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. న్యూయార్క్‌ను విడిచి రావడంలో భాద, సంతోషం రెండూ ఉన్నాయి. ఇండియాకి త్వరలో వచ్చేస్తున్నాను అని ఆనందంగా ఉన్నాను. న్యూయార్క్‌లో గడిపిన రోజుల్ని తలచుకుంటుంటే వెళ్లిపోవడానికి మనసు ఒప్పుకోవడం లేదు అని ట్వీట్ చేసింది ప్రియాంక. ఏబీసీ సంస్థతో ప్రియాంక ఒప్పందం చేసుకుందట. క్యాంటికో మూడో సీజన్‌ను తెరకెక్కించే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. తాను నటించిన తొలి హాలీవుడ్ చిత్రం బేవాచ్ ప్రచారం కోసం మేలో అమెరికా వెళ్లే అవకాశం ఉందట ప్రియాంక చోప్రా.













