ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంక
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టీవీ తారల్లో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్థానం దక్కించుకున్నారు. రూ.65.52 కోట్ల పారితోషికం తీసుకుంటూ ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసిన టాప్-10 జాబితాలో ప్రియాంకా ఎనిమిదో స్థానం కైవసం చేసుకున్నారు. క్యాంటికో టీవీ షోతో పశ్చిమదేశాల్లో వినోద రంగంలోకి అడుగుపెట్టిన ప్రియాంకా బేవాచ్ సినిమాతో హాలీవుడ్‌తో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఇక, రూ.271.85 కోట్ల అర్జనతో కొలంబియా నటి సోఫియా వెర్గారా వరుసగా ఆరో ఏడాదీ టాప్-10లో నంబర్‌వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ది బిగ్ బ్యాంగ్ థియరీ నటి కేలీ కుకో రూ.170.39 కోట్ల సంపాదనతో రెండో స్థానంలో నిలిచారు. గ్రేస్ అనాటమీ నటీమణి ఎలెన్ పోంపియో రూ.85 కోట్ల సంపాదనతో మూడో స్థానం దక్కించుకున్నారు.













