త్వరలో ప్రియమణి పెళ్లి
ఒకప్పుడు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో మంచి హీరోయిన్గా చక్రం తిప్పిన హీరోయిన్ ప్రియమణి త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. కొద్దికాలం క్రితమే తన బాయ్‌ఫ్రెండ్ ముస్తఫా రాజ్‌తో బెంగళూరులో నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఈ నెల 23న పెళ్లి చేసుకోనుంది. ఈ వివాహం సెలబ్రెటీల పెళ్లిలా ఖరీదుగా కాకుండా చాలా సింపుల్‌గా రిజస్టర్ ఆఫీసులో జరగనుంది. కానీ పెళ్లి తర్వాత మాత్రం బెంగళూరులోని ఒక స్టార్ హోటల్లో ఘనమైన రీతిలో రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. చివరగా తెలుగులో మన ఊరి రామాయాణం చిత్రలో కనిపించిన ఆమె ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తోంది.













