ముస్తఫారాజ్తో ప్రియమణి పెళ్లి
తన చిరకాల ప్రియుడైన వ్యాపారవేత్త ముస్తఫారాజ్ను సినీ నటి ప్రియమణి పెళ్లిచేసుకున్నారు. బెంగళూరులోని జయనగర రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని నిరాడంబరంగా ఒక్కటయ్యారు. వీళ్ల నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. వివాహానికి వీరిద్దరి కటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బంధుమిత్రులు, ఆప్తుల కోసం బెంగళూరు శివార్లలోని ఎలెన్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటుచేశారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని ఈ సందర్భంగా ప్రియమణి చెప్పారు. తను నటించిన కన్నడ భాషలో వ్యూహ, తమిళంలో అజంతాచాండి, కాదల్ ముడిచు, తెలుగులో అంగులికా, ప్రియతమా రావే, మళయాలంలో పాపా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని ప్రియమణి చెప్పారు.













