విరాట్ కి ప్రభాస్ కానుక
బాహుబలి ప్రభాస్ విరాట్‌కి మర్చిపోలేని బహుమతి ఇచ్చారు. విరాట్ అంటే మన టీం ఇండియా కెప్టెన్ కాదండోయ్. ప్రముక నటుడు విక్రమ్ ప్రభు కుమారుడు. విరాట్ ప్రస్తుతం నెరుప్పుడా చిత్రంలో నటిస్తున్నారు. ఈ నెలలో విరాట్ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ విరాట్‌కి బాహుబలి ఖడ్గాన్ని కానుకగా ఇచ్చారు. ఖడ్డంపై టు విరాట్ విత్ లవ్ ప్రభాస్ అని రాశారు. ఈ విషయాన్ని విక్రమ్ ప్రభు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఫొటో పోస్ట్ చేశారు. ఓ మంచి యువకుడికి మంచి మనిషి ఇచ్చిన కానుక. ధన్యవాదాలు ప్రభాస్. నువ్వు గొప్పవాడిని అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.













