సాహో లో హీరోయిన్ ఎవరో తెలుసా?
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. హైటెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయంపై ఇంకా సృష్టత రాలేదు. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు విన్పించాయి. తాజాగా అనుష్క పేరు కూడా వినిపించింది. కానీ అమె ఈ సినిమా చేయడంలేదని సృష్టం చేయడంతో ఇప్పుడు హీరోయిన్ ఎవరనే ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా బాలీవుడ్ గ్లామర్ భామ శ్రద్దాకపూర్‌ను హీరోయిన్గా ఓకె చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే అమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్గా బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న శ్రద్ధాకపూర్ తాజాగా దావుద్ చెల్లిలి పాత్రలో నటించిన సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా వుంది. మొత్తానికి ఈ సినిమాలో శ్రద్దా దక్షిణాదికి పరిచయం కానుంది.













