‘సాహో’ సినిమాలో అనుష్క!
ప్రభాస్ బాహుబలి తర్వాత చేస్తున్న చిత్రం సాహో. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఎవరు కథానాయికగా చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారిపోయింది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. టాలీవుడ్ నుంచి అనుష్క పేరు ఎక్కువగా మోగింది. ఇది నిజమా? కాదా? అని మాత్రం చిత్రబృందం నిర్ధారించలేదు. చివరకు సాహోకు అనుష్కనే కన్ఫార్మ్ చేసిందని సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా ట్వీట్ చేశారు. అయిదే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో అనుష్క, ప్రభాస్ కాంబినేషన్లో బిల్లా, మిర్చి బాహుబలి సినిమాలు వచ్చాయి.













