Pooja Kumar has a tailor-made role in ‘PSV Garuda Vega’
అతి తక్కువ సమయం లోనే విశ్వరూపం సినిమా తో మంచి నటి గా గుర్తింపు తెచ్చుకున్న నటి పూజ కుమార్. దాని తరవాత కమల్ హస్సన్ కాంబినేషన్ లో వచ్చిన ఉత్తమ విల్లియన్ చిత్రం లో హీరో కి ధీటుగా తన నటన ప్రావీణ్యాన్ని కనబరిచింది. ఆలా భిన్నమైన పత్రాలు చేస్తూ నటనా పరంగా ముందుకు వెళుతున్న పూజ కుమార్ కి దాని తరవాత చాల అవకాశాలు పాత్రల రూపం లో వచ్చిన తన హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ & ముందు చేసిన మూవీస్ కి క్యారెక్టర్ సరితూగక వదులుకున్నా, ఇప్పుడు గరుడ వేగా అనే మూవీ లో స్వాతి అనే క్యారెక్టర్ తన కోసమే తీర్చి దిద్ద బడింది అని భావించి డా. రాజశేఖర్ సరసన భార్యగా 6 సంవత్సరాల బాబుకి తల్లి గా నటిస్తుంది.













