కె.విశ్వనాథ్‌కు ప్రధాని మోడీ అభినందన
జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. సినిమారంగ అభివృద్ధికి వీరి సృజనాత్మకత, వీరు చేస్తున్న కృషి మరువలేనివన్నారు. దాదాసాహెబ్ అవార్డు అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. కె.విశ్వనాథ్ ఓ గొప్ప దర్శకుడిగా విశిష్టతను సంపాదించుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు ఆయనకు నా శుభాకాంక్షలు అని ట్వీటర్లో మోదీ పేర్కొన్నారు.








