ఉస్మానియాకు వందనాలు
చదువుల మాత ఉస్మానియా యూనివర్సిటీ శత వసంతాల పండుగను నేటి నుంచి జరుపుకుంటున్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మందికి జ్ఞాన వెలుగులను పంచిపెడుతున్న ఈ విద్యాలయానికి ప్రమాణాలు అర్పిస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బ్రిటీష్ విద్యావేత్త విల్ఫ్రేడ్ స్యుయన్ బ్లంట్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుని, ఏడో నిజం నవాబ్ ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ విశ్వవిద్యాలయం రానున్న రోజుల్లో కూడా దేశానికి అవసరమైన మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు, కళాకారులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు.













