ఫేస్బుక్, వాట్సాప్‌లో కాటమరాయుడు
పవన్‌కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రాన్ని గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఫేస్బుక్, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తున్నారని నిర్మాత శరత్‌మరార్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాత తరపున నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సాయి రామకృష్ణ లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందచేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ చాంద్‌బాషా చిత్రానికి సంబంధించిన వాటిని తొలగించాలని ఫేస్బుక్, వాట్సాప్ సంస్థల ప్రతినిధులను కోరారు. ఫేస్బుక్లో పోస్ట్చేసిన అంశాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.













