నేను పవన్ భార్యను కాదు : రేణూ దేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా విషయాలలోనే కాదు పర్సనల్ విషయాలోనూ అభిమానులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. రేణూ దేశాయ్ నుండి పవన్ విడిపోయి చాలా కాలం అయినప్పటికీ ఇప్పటికి సోషల్ మీడియాలో రేణూనే మా వదిన అని కొందరు పాట పాడుతున్నారు. పలు మార్లు రేణూ పేజ్ లో మీరిద్దరు తిరిగి భార్య భర్తలు కావొచ్చు కదా అని కొందరు ఫ్యాన్స్ తమ వాదనలు వినిపిస్తున్నారు. వీటికి రేణూ వివరణ ఇస్తున్నప్పటికి అభిమానులు మా వదిన మీరే మా అన్నయ్య పవనే అంటూ స్లోగన్స ఇస్తున్నారు. దీంతో కాస్త అసంతృప్తిగా ఫీలైన రేణూ దేశాయ్ అభిమానులకు ఫేస్ బుక్పేజ్లో పూర్తి వివరణ ఇచ్చింది. కళ్యాణ్ గారి భార్య ఆనా, నేను కాదు అంటూ తెలిపింది.








