స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
భారత స్వాతంత్య్రదినోత్సవం ఆగస్టు 15ను పురస్కరించుకుని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ఓ ట్వీట్ చేశారు. మన దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు కానీ, జాతికి సంబంధించి ఇదొక్కటై ఘనమైన పండగ రోజు. జైహింద్ అని తన ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు.








