కుమార్తె బర్త్ డే వేడుకలో పవర్ స్టార్
సినిమా రాజకీయాలతో ఎప్పుడు బిజీగా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పిల్లలకు కేటాయించే సమయం విషయంలో మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాడు. అందుకే కాటమరాయుడు సినిమా రిలీజ్ బిజీలో ఉండి కూడా కూతురు ఆద్య బర్త్ డే సందర్భంగా ఆమెతో సమయం గడిపి వచ్చాడు. పవన్‌కల్యాణ్-రేణు దేశాయ్‌ల కుమార్తె ఆద్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్‌కల్యాణ్ స్వయంగా ఆద్య జన్మదిన వేడుకలో పాల్గొని కేక్ తినిపించారు. ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకలో పవన్ పాల్గొన్న ఫొటోలను రేణుదేశాయ్ అభిమానులతో పంచుకున్నారు. తమ బిడ్డల పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఇచ్చే నిజమైన బహుమతి వారితో గడిపే సమయమే అని రేణు ట్వీట్ చేశారు.







