జైలులో పవిత్రా గౌడ కన్నీళ్లు.. బెయిల్ ఇవ్వండి లేదంటే విషం ఇవ్వండి
పవిత్రా గౌడ(pavitra gowda) జైలు లైఫ్ పై సెన్సేషనల్ ఆరోపణలు చేయడంతో రేణుకాస్వామి(renuka swami) హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న తనకు తోటి ఖైదీల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె కోర్టు ముందు వాపోయినట్లు సమాచారం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైన పవిత్ర ఎమోషనల్ కు గురై, నైజీరియా మహిళా ఖైదీలు తనను వేధిస్తున్నారని ఆరోపించినట్లు తెలుస్తోంది.
తన పరిస్థితిని వివరిస్తూ పవిత్ర బెయిల్ మంజూరు చేయాలని కోరినట్లు, లేదంటే విషం ఇచ్చి చనిపోయేలా చేయాలని కోర్టును వేడుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తరఫు న్యాయవాదులు స్పెషల్ బ్యారక్కు తరలించాలని కోరారు. ఇప్పటికే జైలు అధికారులు ఆమెను తక్కువ మంది ఖైదీలు ఉన్న మరో బ్యారక్కు తరలించినట్లు సమాచారం.
ఇదే సమయంలో బెయిల్ కోసం పవిత్ర తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, కేసులో గణనీయమైన స్థాయిలో సాక్షుల విచారణ పూర్తైందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడటంతో నెక్ట్స్ డెసిషన్ కోర్టు చేతుల్లో ఉంది. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర ఏ1 నిందితురాలిగా, నటుడు దర్శన్(darshan)తో పాటు విచారణను ఎదుర్కొంటున్నారు.








