వారణాసిలో మహేష్ కొత్త లుక్.. ఆ సీన్లే స్పెషల్
సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu)- దర్శకధీరుడు రాజమౌళి(rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి (Varanasi) పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కనిపించే విధానంలోనూ స్సెషాలిటీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కథలోని కొన్ని కీలక ఘట్టాల కోసం మహేష్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారని సమాచారం. ఇప్పటివరకు చూసిన మహేష్ బాబు లుక్స్‌తో పోలిస్తే ఈ గెటప్ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని ఇవ్వనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
కథలోని కొన్ని ఎపిసోడ్లలో మహేష్ బాబు 24 ఏళ్ల యువకుడిగా కనిపించాల్సి ఉంటుందట. ఈ సీన్స్ కోసం వీఎఫ్ఎక్స్ లేదా ఏఐ ఆధారిత డీ ఏజింగ్‌ను ఆశ్రయించకుండా, మహేష్ బాబు స్వయంగా మేకోవర్ కావడం విశేషంగా మారింది. పాత్రకు తగ్గట్టుగా శారీరకంగా కూడా సిద్ధమైన మహేష్.. ఇప్పటివరకు కెరీర్లో కనిపించనంత ఫిట్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని టాక్. ఈ లుక్కు సంబంధించిన వివరాలను చిత్ర బృందం ప్రస్తుతానికి గోప్యంగానే ఉంచుతోంది.
ఇవి కూడా చదవండి
ఇక వారణాసి షూటింగ్‌ను మహేష్ బాబు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెబుతున్న ఆయనతో పాటు మిగిలిన షూటింగ్ వర్క్స్ ను రాజమౌళి అక్టోబర్‌లోపు పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలయ్యాయి. ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై పని చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran), ప్రియాంక చోప్రా(priyanka chopra) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కె.ఎల్. నారాయణ(KL Narayana) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.








