నటనకు డానియల్ గుడ్‌బై
మూడుసార్లు ఆస్కార్లు గెలుచుకున్న హాలీవుడ్ దిగ్గజ నటుడు డానియల్ డే లెవిస్ నటించిన కొత్త చిత్రాలు ఇక కనిపించవు. నటకు గుబ్‌బై చెప్పారు. ఇక నుంచి మూవీలు చేయడం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని నటుడి వ్యక్తిగత కార్యదర్శి లెస్లీ డార్ట్ ప్రకటించారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీవ్ స్పిల్ బర్గ్ తీసిన లింకన్, దేర్ విల్ బి బ్లడ్, మై లెఫ్ట్ పూట్, గ్యాంగ్స్ ఆఫ్ ఇది న్యూయార్క్ మూవీలతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆరవై ఏళ్ల సీనియర్ నటుడి చివరి మూవీ ఈ డిసెంబర్ 25న విడుదల కానుంది. ఆ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. 14 ఏళ్ల వయసులో 1971లో విడుదలైన సండే బ్లడీ సండేతో ఇండస్ట్రీకి పరిచయమైన డానియల్ అంచెలంచెలుగా ఎదిగారు. మూడుసార్లు ఆస్కార్ అవార్డులను కొల్లగొట్టిన ఘతన ఆయనది. ఇన్నేళ్లుగా నన్ను అభిమానించి, నాపై ప్రేమ చూపించిన ప్రేక్షకులు మూవీ బృందాలకు ధన్యవాదాలు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఇక రంగుల ప్రపంచానికి సెలవు పలకాలని నిర్ణయించుకున్నా అని ఆస్కార్ గ్రహీత డానియల్ డే లెనిస్ అన్నారు.













